భారతదేశం, జూన్ 27 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్​ఈ 10వ, 12వ తరగతులకు సంబంధించిన సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తాజగా విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు జులై 15 నుంచి జులై 22 వరకు జరుగుతాయి. కాగా, 12వ తరగతి పరీక్ష జులై 15న ఒకే రోజులో నిర్వహించడం జరుగుతుంది.

సీబీఎస్​ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌లతో ప్రారంభమవుతాయి. 12వ తరగతికి సంబంధించిన అన్ని పేపర్లు ఒకే రోజు ఉంటాయి.

రెండు తరగతులకు సంబంధించిన పరీక్షలు కొన్ని రోజులు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మరికొన్ని రోజులు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు సబ్జెక్టును బట్టి జరుగుతాయి.

పరీక్షా కేంద్రంలోకి కమ్యూనికేషన్ పరికరాలు తీసుకురావడం పూర్తిగా నిషేధం. వీటిని కలిగి ఉన్నా లేదా ఉపయోగించినా అధికారులు కఠిన చర్యలు తీ...