భారతదేశం, ఏప్రిల్ 16 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మన జీవితాలపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా విలాసవంతమైన జీవితానికి, ఆర్థిక స్థితిగతులకు కారకుడైన శుక్రుడు (Venus) ప్రస్తుతం మేష రాశిలో భరణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే, ఏప్రిల్ 16, 2026 అనగా ఈరోజు శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చుకుని, సూర్యుడికి చెందిన కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.

ఈ సమాచారం ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాధారణంగా సూర్యుడు అధికారానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయితే, శుక్రుడు భోగభాగ్యాలకు చిహ్నం. సూర్యుడి నక్షత్రంలో శుక్రుడి సంచారం అనేది అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా కొన్ని రాశుల వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఆర్థిక బలాన్ని నింపుతుంది. ఈ 12 రోజుల కాలంలో ఏయే రాశుల వారు లాభపడనున్నారో ఇప్పుడు విశ్లేషిద్దాం.

మేష రాశిలోనే శుక్రుడి ఈ మార్ప...