భారతదేశం, సెప్టెంబర్ 30 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాల వల్లే సిరిసిల్ల ప్రాంతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కేసీఆర్ కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతకుముందు సీఎం రేవంత్ సిరిసిల్లలో పాదయాత్ర చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న విగ్రహాం మీదుగా పాదయాత్ర సాగింది.

సిరిసిల్ల అంటే సంపదకు, చేనేత కళకు నిలయమని, అలాంటి ప్రాంతాన్ని గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉరిసిల్లగా మార్చారని సీఎం మండిపడ్డారు. చేనేత, గీత కార్మికుల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఆత్మహత్యలు, వలసలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు మరణి...