భారతదేశం, ఆగస్టు 9 -- టోవినో థామస్ హీరోగా నటించిన 'నడికర్' చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో అడుగుపెట్టింది. ఇది ఇప్పుడు సైనా ప్లేలో పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అహంకారి అయిన ఓ నటుడికి చివరికి తన సత్తా ఏంటో తెలిసే కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే సినీ పరిశ్రమ అనేక కోణాలను పరిశీలించే అనేక మలయాళ చిత్రాలు ఇప్పటికే వచ్చాయి. సినిమా సెట్స్ పై ఆధారపడిన కొన్ని ఆసక్తికరమైన సినిమాల లిస్ట్ ఇక్కడుంది. వీటిని ఓటీటీప్లే ప్రీమియంలో చూడొచ్చు.

2025 ఏడాదిలో మొట్టమొదటి మలయాళ బాక్సాఫీస్ హిట్ సినిమా రేఖా చిత్రం. 1980 ల చివరలో ఒక ప్రముఖ హీరో మమ్ముట్టి సినిమా సెట్స్ లో మిస్సింగ్ కేసుపై పోలీసుల దర్యాప్తు చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. సినిమాటిక్, ఇన్వెస్టిగేటివ్ అంశాలను కథనంలో మేళవించిన ఈ సినిమాలో చాలా క్యామియోలు ఉన్నాయి. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఆర్టిఫిషియల్ ఇ...