భారతదేశం, డిసెంబర్ 9 -- దురందర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 4వ రోజు: దురంధర్ మూవీ టిక్కెట్ కౌంటర్ వద్ద తన వేగాన్ని కొనసాగిస్తోంది. ఇప్పట్లో అది తగ్గే సంకేతాలు ఏవీ కనిపించడం లేదు. మండే టెస్ట్ కూడా ఈ మూవీ పాసైంది. ఆదిత్య ధార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ దురంధర్ తన తొలి వీకెండ్ లో ఇండియాలో రూ.103 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పుడు వీక్ డేస్ లోనూ అదరగొడుతోంది.

ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్. నోటి మాటల ద్వారా గణనీయమైన ఊపు తెచ్చుకుని అద్భుత ప్రదర్శన చేస్తోంది ఈ సినిమా. ఇప్పుడు తన తొలి వారం రోజున ఈ చిత్రం ముఖ్యమైన సోమవారం టెస్ట్‌ను విజయవంతంగా దాటినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో కలిపి ఇండియాలో రూ.123.91 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

సోమవారం (డిసెంబర్ 8) ఈ చిత్రం థియేటర్లలో తన తొలి వా...