Hyderabad, ఆగస్టు 7 -- సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్ళినప్పుడు, ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్య సంచారం అన్ని రాశుల వారిపై ఎంతో ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు సంతోషంగా ఉంటారు.

ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 17న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సూర్య సంచారం వలన ఏ రాశుల వారికి సమస్యలు రావచ్చు? ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది?

కన్యా రాశి వారికి సూర్య సంచారం చిన్నపాటి సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పనులు పూర్తి చేయడానికి కష్టపడతారు. కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఖర్చ...