భారతదేశం, అక్టోబర్ 20 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల కదలిక మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.

భూమికి పుత్రుడిగా, శక్తికి, సాహసానికి ప్రత్యేకంగా ఉండే అగ్నితత్వ గ్రహం కుజుడి సంచారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నవంబర్ 12 రాత్రి 8:06కి కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

సింహ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడి రాశిలోకి కుజుడు అడుగుపెట్టడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ సమయంల...