భారతదేశం, జూలై 20 -- ఎంజీ మోటార్ నుంచి ఫుల్లీ ఎలక్ట్రిక్, 3- రో లగ్జరీ ఎంపీవీ సోమవారం భారత మార్కెటలో లాంచ్​కానుంది. దాని పేరు ఎంజీ ఎం9. 2025 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఈ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోడల్.. భారత మార్కెట్ కోసం ప్రవేశపెట్టిన ఐదొవ ఈవీ. మే 2025 నుంచి రూ. 51,000 టోకెన్ డిపాజిట్‌తో దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ఎం9 ఈవీని ఎంజీ సెలెక్ట్ అనే ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుతో పాటు ఇది అందుబాటులో ఉంటుంది. లగ్జరీ ఎంపీవీ విభాగంలో టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్ వంటి వాహనాలకు ఇది పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీబీయూ దిగుమతి కారణంగా దీని ధర రూ. 65-70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ...