భారతదేశం, ఆగస్టు 12 -- భారతదేశం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కియా సైరోస్ ఈవీ ఒకటి! ఈ కారును కియా ప్రస్తుతం అభివృద్ధి చేస్తోంది. ఇటీవల, ఫుల్లీ కవర్డ్​ టెస్ట్ మోడల్ మొదటిసారిగా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జింగ్ అవుతూ కనిపించింది. కారు పూర్తిగా కవర్ చేసి ఉన్నప్పటికీ, దానిలోని ముఖ్యమైన డిజైన్ వివరాలను గమనించవచ్చు. ఎలక్ట్రిక్​ కారుపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

గట్టిగా కప్పి ఉంచినప్పటికీ, కొత్త కియా సైరోస్ ఈవీ నిటారుగా ఉన్న బాడీ స్టైల్, బాక్సీ ఆకారాన్ని బట్టి చూస్తే ఇది ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని స్పష్టమవుతోంది. ఇది స్టాండర్డ్ కియా సైరోస్ డిజైన్‌ను పోలి ఉంటుందని అంచనా. కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ మాదిరిగానే, సైరోస్ ఈవీ కూడా తన పెట్రోల్ వర్షెన్ సైరోస్ డిజైన్‌ను అనుసరిస్తుందని తెలుస్తోంది.

సైరోస్ ఈవ...