భారతదేశం, జూలై 28 -- తెలంగాణవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీని కారణంగా అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. కాగా భారీ వర్షాల ప్రభావం సింగరేణి కార్యకలాపాలపైనా పడింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి భారీ స్థాయిలో పడిపోయింది. వాస్తవానికి రోజుకు 2.20లక్షల బొగ్గు డిమాండ్​ ఉండగా, వర్షాల కారణంగా సగటున లక్షన్నర టన్నుల కన్నా తక్కువ ఉత్పత్తి జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బొగ్గును థర్మల్​ విద్యుత్​ కేంద్రాలతో పాటు అనేక పరిశ్రమలకు సరఫరా చేయాల్సి ఉండటంతో, ఆయా చోట్ల కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.

నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్​ కేంద్రంలో కనీసం 22 రోజులకు సరిపడా స్టోరేజీ ఉండాలి. కానీ భద్రాద్రి విద్యుత్​ ప్లాంటులో ప్రస్తుతం, కేవలం 14 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్టు సమాచా...