భారతదేశం, జూన్ 24 -- గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇదొక లాకప్‌డెత్ (పోలీస్ కస్టడీలోనే మరణం) అని, అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని ప్రత్యేక విచారణ బృందం (SIT) నిర్ధారించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, పోలీసులు ఆయన్ను 2వ ఏజేఎస్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచనల విషయాలు విషయాలను పొందుపరిచారు.

సాయికృష్ణది ముమ్మాటికీ లాకప్‌డెత్ అని సిట్ స్పష్టం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌పై అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చి, తీవ్రంగా గాయపరచడం వల్లే మరణించాడని పేర్కొంది. అనంతరం ఆధారాలు దొరకకుండా శవాన్ని మాయం చేశారని వెల్లడించింది.

మే 5 నుంచి జూన్ 19 (2026) మధ్య కాలంలో విజయవాడ కృష్ణలంక ప...