భారతదేశం, జూలై 30 -- బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటే ఫ్యాన్స్ కు ఉండే క్రేజే వేరు. తమ ఫేవరెట్ స్టార్ ను కలవాలని ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ముగ్గురు మైనర్ బాలురు కూడా సల్మాన్ ఖాన్ ను కలవాలనుకున్నారు. అందుకే ఇళ్ల నుంచి పారిపోయారు. ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ మధ్యలో ప్లాన్ ఫెయిలైంది. సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ఈ ముగ్గురు బాయ్స్ ను కనిపెట్టారు.

జూలై 25 న ఢిల్లీ నుంచి అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలురు మహారాష్ట్రలోని నాసిక్ లోని రైల్వే స్టేషన్లో సురక్షితంగా కనిపించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కలుస్తామనే ఆశతో ఇంటి నుంచి పారిపోయిన నాలుగు రోజుల తర్వాత వీళ్లను వెతికి పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన 13, 11, 9 ఏళ్ల బాలురు సల్మాన్ ఖాన్ ను కలవాలని అనుకున్నారు. ఈ ముగ్గురూ ఆన్ లైన్ గేమింగ్ ప్లా...