భారతదేశం, సెప్టెంబర్ 30 -- చాలా ఆలస్యం తర్వాత జూనియర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీలీల, కిరీటి జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ (సెప్టెంబర్ 30) ఒకే రోజు మూడు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా సడెన్ గా మూవీ ఓటీటీలోకి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. మళ్లీ ఇందులో ఎవరూ ఊహించని ప్లాట్ ఫామ్ లోనూ మూవీ స్ట్రీమింగ్ రావడం కొసమెరుపు.

టాలీవుడ్ సెన్సేషన్ హాట్ బ్యూటీ శ్రీలీల రొమాంటిక్ మూవీ జూనియర్ ఓటీటీలోకి వచ్చేసింది. సడెన్ గా మంగళవారం మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఆహాలో మూవీ రిలీజ్ అవుతుందని ముందుగానే ప్రకటించారు. మరోవైపు కన్నడ భాషలో నమ్మఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ వీటితో పాటు అనూహ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్ధన్...