భారతదేశం, సెప్టెంబర్ 13 -- గ్రేటర్ మాంచెస్టర్‌లోని టేమ్సైడ్ హాస్పిటల్‌లో గాల్‌బ్లాడర్ సర్జరీ చేయించుకుంటున్న రోగిని అనస్తీషియాలోనే వదిలేసి, మరో ఆపరేటింగ్ థియేటర్‌లో ఓ నర్సుతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఓ వైద్యుడుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన సెప్టెంబర్ 16, 2023న జరిగిందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. దీనికి సంబంధించి యూకే వైద్య ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. ఈ ఘటన జరిగినప్పుడు 44 ఏళ్ల కన్సల్టెంట్ అనస్తీషియాలజిస్ట్ డాక్టర్ సుహైల్ అంజుమ్ ఆపరేషన్ థియేటర్​లో ఉన్నారని ఆ వార్తా సంస్థ తెలిపింది.

ఈ దారుణమైన ఘటనను అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో నర్సు 'ఎన్టీ' చూశారు. డాక్టర్ అంజుమ్‌ను, నర్సును చూసినట్లు ట్రిబ్యునల్‌ ముందు తెలిపారు. డాక్టర్ సుహైల్ అంజుమ్ సుమారు ఎనిమిది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి శస్త్ర...