భారతదేశం, జూలై 22 -- ఇండియాలో బెస్ట్​ 7 సీటర్​ ఫ్యామిలీ కార్లలో రెనాల్ట్​ ట్రైబర్​ ఒకటి. 2019లో మార్కెట్​లోకి అడుగుపెట్టిన ఈ మోడల్​కి సంస్థ ఇప్పటివరకు మేజర్​ అప్డేట్స్​ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు, రెనాల్ట్​ ట్రైబర్​ ఫేస్​లిఫ్ట్​ జులై 23న ఇండియాలో లాంచ్​కానుంది. లాంచ్​కి ముందు, సంస్థ ఈ అఫార్డిబుల్​ ఎంపీవీకి సంబంధించిన టీజర్​ని విడుదల చేసింది. అంతేకాదు, సరికొత్త రెనాల్ట్​ లోగోని కూడా ఆవిష్కరించింది. ఈ లోగో ట్రైబర్‌తో పాటు రాబోయే అన్ని వాహనాలపై ఉపయోగించనున్నారు. ప్రస్తుత లోగోతో పోలిస్తే కొత్త లోగో మరింత స్టైలిష్‌గా, ఆధునికంగా కనిపిస్తుంది. ఇది రాబోయే వాహనాలకు సరికొత్త రూపాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 రెనాల్ట్​ ట్రైబర్​కి సంబంధించి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

తాజా స్పై షాట్స్​ ప్రకారం.. 2025 రెనాల్ట్ ట...