భారతదేశం, ఆగస్టు 25 -- 2025 రెనాల్ట్ కైగర్ మార్కెట్లోకి వచ్చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.29 లక్షలుగా ఉంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్న మోడల్ ధర రూ. 9.99 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే పాత మోడల్‌తో పోలిస్తే, కొత్త కైగర్ టాప్-ట్రిమ్ ధర రూ. 6,000 ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన పోటీదారు అయిన నిస్సాన్ మాగ్నైట్‌తో పోలిస్తే, బేస్ వేరియంట్‌లో కైగర్ కంటే మాగ్నైట్ రూ. 15,000 అధిక ధర కలిగి ఉంది.

రెనాల్ట్ కైగర్ ఫేస్​లిఫ్ట్​తో సంస్థ వేరియంట్ల వ్యూహాన్ని మార్చింది. ప్రస్తుతం, దీని శ్రేణి 'ఆథెంటిక్' వేరియంట్‌తో మొదలవుతుంది. దీని ధర రూ. 6.29 లక్షలు. దీని తర్వాత ఉండే 'ఎవల్యూషన్' వేరియంట్ ధర రూ. 7.09 లక్షలు. అలాగే, 'టెక్నో', 'ఎమోషన్' ట్రిమ్‌ల ధరలు వరుసగా రూ. 8.9 లక్షలు- రూ. 9.14 లక్షలు. ఈ ధరలన్నీ నాన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ల ఎక్స్-షోరూమ...