భారతదేశం, ఆగస్టు 28 -- పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ అంథాలజీ సిరీస్ 'మాన్‌స్ట‌ర్‌'లో మూడో సీజన్ రాబోతోంది. ఈ సారి మరింత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉండే రియల్ స్టోరీని మేకర్స్ చెప్పబోతున్నారు. సమాధులు తవ్వి శవాల ఎముకలు, చర్మం సేకరించే సీరియల్ కిల్లర్ కథ ఇది. ముఖ్యంగా ఆడవాళ్లపై పగబట్టే కిల్లర్ స్టోరీ ఇది.

సీరియల్ కిల్లర్ ఎడ్ గీన్ రియల్ స్టోరీతో మాన్‌స్ట‌ర్‌ మూడో సీజన్ రాబోతుంది. మాన్‌స్ట‌ర్‌ ది ఎడ్ గీన్ స్టోరీ పేరుతో ఓటీటీలోకి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ వస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ అమెరికన్ టీవీ సిరీస్ గత రెండు సీజన్లు ఎంతో పాపులర్ అయ్యాయి. 2022 సెప్టెంబర్ 21న ఫస్ట్ సీజన్, 2024 సెప్టెంబర్ 19న రెండో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చాయి.

ఇప్పుడు మాన్‌స్ట‌ర్‌ ది ఎడ్ గీన్ స్టోరీ సీజన్ 3 ఓటీటీల...