Hyderabad, ఆగస్టు 28 -- కేజీఎఫ్, ఓదెల, ఓదెల 2 సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు వశిష్ట ఎన్ సింహా నటించిన లేటెస్ట్ మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, సత్యం రాజేష్, సాంచీ రాయ్ సైతం ముఖ్య పాత్రలు పోషించారు.

డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను నటుడు వశిష్ట ఎన్ సింహా పంచుకున్నారు.

-ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ వల్ల మోహన్ గారు నాకు ఈ కథను వినిపించారు. ఏవమ్ షూటింగ్‌లో ఉన్నప్పుడు మోహన్ గారు, నరేంద్ర గారు ఈ పాయింట్‌ను చెప్పారు. సోషియో, థ్రిల్లర్ అని చెప్పి ఈ టైటిల్‌ను చెప్పారు. త్రిబాణధారి బార్బరిక్ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ పాత్ర గురించి బయట చాలా మంద...