భారతదేశం, ఆగస్టు 25 -- ముగ్గురు పసిపిల్లల భవిష్యత్తును వెలుగులతో నింపాల్సిన ఆ తల్లి, తన అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నాడని భావించి, పచ్చని సంసారాన్ని కూల్చేసింది. చివరికి తాళి కట్టిన భర్తను వరసకు కొడుకయ్యే వ్యక్తితో కలిసిబలి తీసుకుంది. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో కలకలం రేపింది.

చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య(38), శారద దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు (ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు). కుటుంబ పోషణ కోసం పంతంగి గ్రామం వద్ద పొలం కౌలుకు తీసుకుని దానయ్య కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే శారద దారి తప్పి అక్రమ సంబంధం పెట్టుకుంది. సోషల్ మీడియాలో విభిన్న అకౌంట్లు నిర్వహిస్తూ, స్థానిక రాజకీయ నాయకులతో సహా పలువురితో సంబంధాలు నడిపిస్తోంది. గతంలోనూ ఆమె మరొకరితో వెళ్లిపోయి తిరిగి...