Hyderabad, ఆగస్టు 19 -- బిగ్ బాస్ 9 తెలుగు అసలు షోకి ముందు ఈసారి అగ్నిపరీక్ష పేరుతో మరో షోకి తెరలేపిన విషయం తెలుసు కదా. ఆగస్టు 22 నుంచి ఇది ప్రారంభం కానుండగా.. మంగళవారం (ఆగస్టు 19) ఓ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో హోస్ట్ శ్రీముఖితోపాటు జడ్జిలు నవదీప్, బిందు మాధవి, అభిజీత్.. కంటెస్టెంట్లకు రకరకాల పరీక్షలు పెట్టడం చూడొచ్చు.

బిగ్ బాస్ 9 తెలుగు అగ్నిపరీక్ష ప్రోమో ఆసక్తికరంగా ఉంది. నిమిషం నిడివి ఉన్న ఈ ప్రోమో సరదా సరదాగా సాగిపోయింది. దీని ద్వారా 40 మంది కంటెస్టెంట్ల నుంచి ముగ్గురిని ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ పరీక్ష ఎలా సాగనుందో ఈ ప్రోమో ద్వారా మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు.

దీనికి జడ్జిలుగా నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ఉన్నారు. ఇక షోని శ్రీముఖి హోస్ట్ చేస్తోంది. ఈ ప్రోమోలో ఓ లేడీ కంటెస్టెంట్ ...