భారతదేశం, డిసెంబర్ 22 -- ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఈ సినిమా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా దురంధర్ నిలిచింది. ఇందులో ర‌ణ్‌వీర్ సింగ్‌, సారా అర్జున్ జంటగా నటించారు.

దురంధర్ మూవీ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. ఈ స్పై థ్రిల్లర్ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. రికార్డులు బ్రేక్ చేస్తూనే సాగుతోంది. ఈ మూవీ తాజాగా భారీ రికార్డును బద్దలు కొట్టింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చింది దురంధర్.

ఇండియాలో టాప్ 10 వసూళ్లు సినిమాల్లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ పదో స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ సినిమాను దాటి ర‌ణ్‌వీర్...