భారతదేశం, ఆగస్టు 11 -- సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. జహీరాబాద్, కోహీర్ మండలాల్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదాల్లో మొత్తం 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై అతివేగంతో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు కూలీలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ప్రమాద తీవ్రతకు తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని పోలీసులు వెంటనే స్థానికుల సహాయంతో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతులు, క్షతగాత్రులంతా పొలం పనుల నిమిత్తం సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామం నుంచి వచ్చిన వ్యవసాయ కూలీలు...