భారతదేశం, డిసెంబర్ 22 -- శర్వానంద్ నటించిన బైకర్ మూవీ రిలీజ్ వాయిదా పడినా అతని నెక్ట్స్ మూవీ నారీ నారీ నడుమ మురారీ మాత్రం అనుకున్న సమయానికే రానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీజర్ ను సోమవారం (డిసెంబర్ 22) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు ప్రేయసిల మధ్య నలిగిపోయే పాత్రలో నవ్వులు పూయిస్తున్నాడు శర్వానంద్.

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ నారీ నారీ నడుమ మురారీ. ఒకప్పుడు టాలీవుడ్ లో బాలకృష్ణ ఇదే టైటిల్ తో మూవీ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు సంక్రాంతికి ఈ కొత్త మూవీ రిలీజ్ కానుంది. టీజర్ లో ఇద్దరు భామలతో ప్రేమాయణం నడిపే పాత్రలో శర్వానంద్ మెప్పించాడు. సామజవరగమన మూవీని డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజే ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

సామజవరగమన ఎంతలా నవ్వించిందో మనకు తెలుసు. దీంతో ఈ నారీ నారీ నడుమ ముర...