భారతదేశం, ఆగస్టు 9 -- ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే ట్రెండింగ్. ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ నుంచి మహేష్ బాబు ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి కొత్త ప్రశ్న రేకెత్తించారు. మూవీ టైటిల్ ను ఆయన రివీల్ చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 'గ్లోబ్ ట్రాటర్' అనే పదానికి రాజమౌళి యాష్ ట్యాగ్ ఇవ్వడమే అందుకు కారణం. ఇప్పుడీ కొత్త యాష్ ట్యాగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

ఇన్ని రోజులు మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో పిలిచారు. కానీ ఇప్పుడీ మూవీకి కొత్త పేరు వచ్చింది. అదే.. 'గ్లోబ్ ట్రాటర్'. ఈ యాష్ ట్యాగ్ తోనే మూవీ టీమ్ సోషల్ మీడియాలో అప్ డేట్లు ఇస్తున్నారు. దీంతో ఇదే సినిమా అఫీషియల్ టైటిల్ హా అనే డౌట్లు వస్తున్నాయి. మరి ఇదే సినిమా పేరు అవుతుందా? లేదా కేవలం ప్రమోషనల...