Hyderabad, ఆగస్టు 25 -- ఓటీటీలోకి సినిమాలు సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత వస్తాయి. లేదా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలాగే, ఓ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అవుతుంది. కానీ, ఇక్కడ ఊహించని విధంగా అసలు షూటింగే మొదలుపెట్టని సినిమాకు ఓటీటీ ఫిక్స్ అయిపోయింది.

ఆ సినిమానే బద్లాపూర్ 2. 2015లో హిందీలో రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా బద్లాపూర్. వరుణ్ ధావన్, యామీ గౌతమ్, నవాజుద్ధీన్ సిద్ధిఖి, రాధిక ఆప్టే నటించిన బద్లాపూర్ సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, ఈ సినిమాకు పదేళ్ల తర్వాత సీక్వెల్ రానుంది.

అదే బద్లాపూర్ 2. బద్లాపూర్‌కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇంతలోనే బద్లాపూర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లా...