భారతదేశం, ఆగస్టు 19 -- మిక్స్ డ్ టాక్ తో సాగుతున్న వార్ 2 సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా సోమవారం (ఆగస్టు 18) ఎఫెక్ట్ ఆ సినిమా మీద గట్టిగానే పడింది. తొలి వీకెండ్ తర్వాత ఈ మూవీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. మరి అయిదు రోజుల్లో ఈ ఫిల్మ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ సారి చూద్దాం.

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 కు మొదటి సోమవారం అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. ఆగస్టు 14న రిలీజైన ఈ మూవీకి తొలి వీకెండ్ తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ చిత్రం ఐదో రోజు సింగిల్ డిజిట్ వసూళ్లకు పడిపోయింది. సోమవారం 76 శాతం తగ్గడం అయాన్ ముఖర్జీ సినిమా లైఫ్ టైమ్ రన్ కు అంత మంచిది కాదు. ఆగస్టు 18న ఈ చిత్రం ఇండియాలో రూ.7.52 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ వెల్లడించింది. ఆదివారం ఆదాయం రూ .32.15 కోట్లతో పోలిస...