Hyderabad, ఆగస్టు 5 -- కన్నడ సినిమా ఇండస్ట్రీ నటుడు సంతోష్ బలరాజ్ (34) మంగళవారం ఉదయం బెంగుళూరులోని కుమారస్వామి లేఅవుట్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో కన్నుమూశాడు. 'ది వీక్' రిపోర్ట్ ప్రకారం అతడు ఉదయం 9:30 గంటల సమయంలో కాలేయం, కిడ్నీ సమస్యలతో తీవ్రమైన కామెర్లతో బాధపడుతూ తుది శ్వాస విడిచాడు. నిజానికి ఈ నటుడు గత నెలలోనే ఆసుపత్రిలో చేరాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందాడు.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ ఇండస్ట్రీలో ఎన్నో మంచి పాత్రలతో పేరు సంపాదించిన యువ నటుడు సంతోష్ బాలరాజ్ కన్నుమూశాడు. సంతోష్ మొదట కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చేరాడు. అప్పుడు అతని ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపించింది. కానీ పరిస్థితి మళ్లీ క్షీణించడంతో తిరిగి ఆసుపత్రిలో చేరాడు.

ఈ వారం మొదట్లో వచ్చిన రిపోర్టుల ప్రకారం అతని ఆరోగ్యం ...