భారతదేశం, మార్చి 26 -- మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా మనిషి తీరు, ప్రవర్తనతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి దేవుడు కూడా ఏదో ఒక రాశిలో జన్మిస్తారని నమ్ముతాము. దేవుళ్లు జన్మించిన రాశుల్లో జన్మించిన మానవులకు ఆ దేవుని ఆశీస్సులు కలుగుతాయని, సంతోషంగా ఉండొచ్చని, వారి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటారు.

శ్రీరాముడికి కొన్ని రాశులతో దగ్గర సంబంధం ఉంటుంది. ఈ రాశుల వారు ఎప్పుడూ కూడా శ్రీరాముని అనుగ్రహాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? శ్రీరాముని అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా, కష్టాలు లేకుండా జీవించే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అదృష్ట రాసుల్లో మీరూ ఒకరేమో చూసేయండి.

తులా రాశి వారు ఎప్పుడూ శ్రీరాముని అనుగ్రహంతో ఉంటారు. ఈ...