Hyderabad, సెప్టెంబర్ 15 -- ఓటీటీలోకి ఈవారం ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు ప్రేమ ఇష్క్ కాదల్. అప్పుడెప్పులో 2013లో థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. సుమారు 12 ఏళ్ల తర్వాత ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం.

తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమ ఇష్క్ కాదల్ ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. గురువారం (సెప్టెంబర్ 18) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది.

"ప్రేమ, నవ్వులు, మరచిపోలేని జ్ఞాపకాలు వచ్చేస్తున్నాయి. ప్రేమ ఇష్క్ కాదల్ సెప్టెంబర్ 18 నుంచి కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో" అంటూ సోమవారం (సెప్టెంబర్ 15) ట్వీట్ చేసింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే యప్ టీవీ, గూగుల్ ప్లేలలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో...