భారతదేశం, డిసెంబర్ 22 -- 1990వ దశకంలో టాప్ హీరోయిన్లుగా వెలుగొందిన శ్రీదేవి, మాధురీ దీక్షిత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదని, వారిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉండేదని అప్పట్లో విపరీతమైన రూమర్స్ ఉండేవి. ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ వార్తలపై మాధురీ దీక్షిత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిసెస్ దేశ్‌పాండే ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల మధ్య పోటీ మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా శ్రీదేవి, మాధురీ దీక్షిత్ మధ్య గట్టి పోటీ ఉండేది. వీరిద్దరి మధ్య మాటలు లేవని ప్రచారం జరిగేది. తాజాగా 'జూమ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురీ దీనిపై స్పందించింది.

"మా ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి గౌరవం లేకపోవడానికి అసలు కారణమే లేదు. ఆమె తన కెరీర్‌లో ఎంతో కష్టపడి పైకి వచ్చారు.. నేను...