భారతదేశం, సెప్టెంబర్ 23 -- శ్రీకాకుళం జిల్లా టెక్కలి పరిధిలో అత్యంత తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న రైలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. మృతులంతా స్థానిక ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌కు చెందిన విద్యార్థులుగా అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు, రైల్వే భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి పట్టణ శివారులోని బర్మా కాలనీ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు రైల్వే ట్రాక్ వైపు వెళ్లారు. అదే సమయంలో వేగంగా వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బలంగా ఢీకొట...