భారతదేశం, ఆగస్టు 17 -- తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నాగ చైతన్యకు కార్ల మీద ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆ లిస్ట్​లోకి ఇప్పుడు మరో లగ్జరీ వాహనం చేరింది. అదే.. బీఎండబ్ల్యూ ఎం2 కూపే. ఇటీవలే ఆయన ఈ కొత్త కారులో తన భార్య, నటి శోభిత ధూళిపాళను తీసుకురావడానికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఎంతో ఖరీదైన, అద్భుతమైన కార్లతో నిండిన చైతన్య గ్యారేజీలో ఇది లేటెస్ట్​ ఎంట్రీ. భారతదేశంలో ఈ పర్ఫార్మెన్స్ కూపే ధర రూ. 1.03 కోట్లు (ఎక్స్-షోరూమ్).

నాగ చైతన్య కొత్త బీఎండబ్ల్యూ ఎం2 కారు 'స్కైస్క్రాపర్ గ్రే మెటాలిక్' రంగులో ఉంది. దీనికి 'M లైట్ డబుల్-స్పోక్ స్టైల్ జెట్ బ్లాక్' అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఈ విభాగంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు ఆ...