భారతదేశం, మే 28 -- గ్రహాల గమనం, గ్రహాల కలయిక మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని యోగాలు అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని యోగాలు సవాళ్లను తీసుకొస్తాయి. అశుభ యోగాల్లో ఒకటైన శూల యోగం జూన్ నెలలో రాబోతోంది. జూన్ 14వ తేదీన మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు శూల యోగం ప్రారంభం అవ్వబోతోంది. ఇది తర్వాత రోజు జూన్ 15 ఉదయం 8 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది.

పేరులో ఉన్నట్లే శూల యోగం శూలంలా గుచ్చుకునే అవకాశం ఉంది. ఈ యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ యోగం ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ ప్రభావం కొనసాగుతుంది. ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థికపరంగా, వ్యక్తిగతపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. మరి ఆ దురదృష్ట రాశులు ఎవరు? శూల యోగంతో ఏ రాశి వారికి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తె...