భారతదేశం, ఆగస్టు 19 -- ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 పోరుకు భారత సైన్యం ఏదో నేడు తేలనుంది. 2025 ఏసీసీ పురుషుల ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును అధికారికంగా ప్రకటించడానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు (ఆగస్టు 19) మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరగనుంది. ఈ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ టీమ్ ను ప్రకటించనున్నారు.

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఆసియా కప్ 2025 జరుగుతుంది. ఆ టోర్నీలో పోటీపడే భారత జట్టును మంగళవారం ప్రకటించబోతున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ స్టార్ట్ అవుతుంది. భారత్ లోని స్టార్ స్పోర్ట్స్ 1 నెట్ వర్క్ లో ఆసియా కప్ 2025 జట్టు ప్రకటన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రస...