భారతదేశం, మే 15 -- హిందూ ధర్మంలో కొబ్బరికాయకు విశిష్టమైన స్థానం ఉంది. గృహప్రవేశం అయినా, కొత్త వాహనం కొన్నా లేదా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా.. ముందుగా కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేయడం మనకు తరతరాలుగా వస్తున్న ఆచారం. అసలు ప్రతి పనిలోనూ కొబ్బరికాయనే ఎందుకు వాడతాం? దీన్ని అంత పవిత్రంగా ఎందుకు భావిస్తాం? దీని వెనుక కేవలం విశ్వాసం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.

కొబ్బరికాయను మన శరీరంతో, మనసుతో పోలుస్తారు పెద్దలు. కొబ్బరికాయ పైన ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది. లోపల మాత్రం తెల్లటి కొబ్బరి, తియ్యటి నీరు ఉంటాయి. ఇది సరిగ్గా మనిషి స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. బయట గట్టిగా కనిపించే పెంకు మనిషిలోని అహంకారం, కఠినత్వం, కోపం వంటి నెగటివ్ లక్షణాలకు గుర్తు.

మనం దైవ సన్నిధిలో కొబ్బరికాయను కొట్టినప్పుడు, మనలోని అహంకా...