శుక్ర ప్రదోష కథ: వ్రత మహిమ ఇదే.. దాంపత్య సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయట!
భారతదేశం, అక్టోబర్ 23 -- హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా వచ్చే శుక్ల, కృష్ణ పక్షాల త్రయోదశి తిథిన ఈ వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా శుక్రవారం నాడు వచ్చే త్రయోదశిని 'శుక్ర ప్రదోష వ్రతం' అంటారు. ఈ పవిత్ర దినాన లయకారకుడైన పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.
సూర్యాస్తమయ వేళ, అనగా సంధ్యా సమయంలో (ప్రదోష కాలం) శివుడుని పూజించడం ఈ వ్రతంలో అత్యంత ముఖ్యం. శివాలయాలను దర్శించి, అభిషేకాలు చేయడం, ప్రదోష వ్రత కథను పఠించడం ద్వారా సంపూర్ణ ఫలితం దక్కుతుంది.
పురాణాల ప్రకారం, పూర్వం ఒక నగరంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్లు. ఒకరు రాజకుమారుడు, మరొకరు బ్రాహ్మణ కుమారుడు, మూడోవాడు ధనికుడి (శ్రేష్ఠి) కుమారుడు. వీరిలో రాజకుమారుడు, బ్రాహ్మణ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.