భారతదేశం, అక్టోబర్ 12 -- జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఐశ్వర్యం, భోగభ్యాగాలు, సౌకర్యాలు, ప్రేమ మరియు దాంపత్య సుఖానికి శుక్రుడే కారకుడు. అటువంటి శుక్రుడి గమనంలో అక్టోబర్ నెలలో వచ్చే మార్పులను జ్యోతిష్య నిపుణులు చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. ఈ నెలలో శుక్రుడి కదలికలు మారడం వల్ల పలు రాశుల వారి జీవితాల్లో కొత్త ఆశలు, అద్భుతమైన అవకాశాలు వెల్లువెత్తనున్నాయి.

పంచాంగం గణాంకాల ప్రకారం.. శుక్రుడు అక్టోబర్ 3, 2026న తిరోగమనం చెందాడు. ఈ తిరోగమన స్థితి నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. ఇదే సమయంలో అక్టోబర్ 12 నుంచి శుక్రుడి అస్తమయ కాలం కూడా ప్రారంభమవుతోంది. మొత్తం 42 రోజుల పాటు శుక్రుడు తిరోగమనంలోనే ఉంటాడు. శుక్రుడి ఈ ప్రత్యేక స్థానంతో వృషభం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో ...