భారతదేశం, సెప్టెంబర్ 10 -- వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 14, సోమవారం నాడు జరుపుకోబోతున్నాము. అయితే, ఈ సందర్భంగా శ్రీ గణేశుడి జన్మ వృత్తాంతం, వినాయకుడిగా, గజాననుడిగా మారిన కథను తెలుసుకుందాం. శ్రీ గణేశుడు, సోదరుడు కార్తికేయుడు మధ్య జరిగిన ఆసక్తికరమైన కథ మీకు తెలుసా? ఇద్దరు సోదరులు భూమండలానికి ప్రదక్షిణలు చేసి ముందుగా ఎవరు తిరిగి వస్తారనే విషయంలో పోటీ పడతారు.

పురాణ కథనం ప్రకారం చూసినట్లయితే, పరమశివుడు, పార్వతీదేవి ఇద్దరు కుమారులైన వినాయకుడు, కుమారస్వామి వివాహం గురించి ఆలోచించారు. ముందుగా ఎవరికి వివాహం జరిపించాలి అనే విషయంలో ఇద్దరికీ ఒక షరతు పెట్టారు. భూమండలం చుట్టూ ప్రదక్షిణలు చేసి ముందుగా తిరిగి వచ్చిన వారికి వివాహం చేస్తామని చెప్తారు. అప్పుడు వారిద్దరూ కూడా అంగీకరిస్తారు. శివపురాణంలోని రుద్రసంహితలోని కుమారఖండంలో వినాయకుడి వివాహ కథత...