భారతదేశం, డిసెంబర్ 24 -- హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అతడు తన వాదనను సమర్థించుకుంటూ.. నిధి అగర్వాల్ బట్టల వల్లే జనం రెచ్చిపోయారని, సమంత చీర కట్టుకుంది కాబట్టి లక్కీగా సేఫ్ అయిందని వ్యాఖ్యానించాడు. దీనిపై నిధి అగర్వాల్ స్పందిస్తూ.. "బాధితులను నిందించడం మ్యానిపులేషన్ (పక్కదారి పట్టించడం) అవుతుంది" అని గట్టిగా బదులిచ్చింది.

హీరోయిన్ల బట్టల గురించి నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇంకా రచ్చ అవుతూనే ఉన్నాయి. తాను చెప్పింది కరెక్టే అంటూ అతడు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలకు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా చురకలు అంటించింది.

డిసెంబర్ 17న 'ది రాజా సాబ్' ఈవెంట్ కోసం లులు మాల్‌కు వెళ్లిన నిధి అగర్వాల్‌ను జనం చుట్టుముట్టిన...