భారతదేశం, డిసెంబర్ 27 -- సీనియర్ తెలుగు నటుడు శివాజీపై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. హీరోయిన్ల డ్రెస్ గురించి అసభ్యంగా మాట్లాడటంతో శివాజీపై సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై అనసూయ, చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ కూడా శివాజీదే తప్పు అనేలా ఓ వీడియోను రీట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ రేప్ ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఈ రేపిస్ట్ ల్లో ఒకరు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ''మంచి అమ్మాయిలు రాత్రి 9 గంటలకు రోడ్డు మీద తిరగరు. రేపు కేసుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలదే ఎక్కువ తప్పు ఉంటుంది'' అని నిర్భయ రేపిస్ట్ సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. ఇప్పుడు శివాజీ చేసిన కామెంట్లను, ఈ వ్యాఖ్యలను ఓ వీడియోలో ఎడిట్ చేశారు.

హీరోయిన్ల డ్రెస్ గురించి మాట్లాడుతూ 'సామాన్లు', 'దొంగ ము**' అనే అసభ్యకరమ...