భారతదేశం, నవంబర్ 10 -- శాంసంగ్ సంస్థ తమ తర్వాతి తరం ఎస్​ సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ ఎస్​26 అల్ట్రా 5జీ మొబైల్‌ను 2026 మొదటి త్రైమాసికంలో విడుదల చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో కెమెరా, పనితీరు పరంగా కొనుగోలుదారులను ఆకట్టుకునే అనేక అప్‌గ్రేడ్‌లు ఉంటాయని భావిస్తున్నారు.

అయితే, మార్కెట్‌లో దీనికి పోటీగా నిలిచేందుకు సరిసమానమైన లేదా మరింత మెరుగైన ఫీచర్లను సహేతుకమైన ధరకే అందించే ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. అటువంటి ఫోన్లలో ఒకటిగా వివో ఎక్స్​300 ప్రో 5జీ నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్‌లో కెమెరా-సెంట్రిక్​ ఫ్లాగ్‌షిప్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది అత్యాధునిక ఏఐ-శక్తిమంతమైన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరును కూడా అందించవచ్చని అంచనా.

కాబట్టి ఏ ఫ్లాగ్‌షిప్‌ను ఎంచుకోవాలో తెలుసుకోవడానికి శాంసంగ్​ గెలాక్సీ ఎస్​...