భారతదేశం, నవంబర్ 4 -- టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ బైకర్. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఈ మధ్యే ఈ సినిమా నుంచి శర్వా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం అతడు పూర్తిగా స్లిమ్ అండ్ ఫిట్ లుక్ లో పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బైకర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శర్వానంద్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ బైకర్ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. ఈ సినిమా కోసం ఆ ఓటీటీ భారీ మొత్తమే చెల్లించినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఈ బైకర్ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.

అదే రోజు బాలకృష్ణ నటించిన అఖండ 2 కూడా రానుండటంతో దీనికి గట్టి పోటీ ఉండనుంది. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమే కానీ.. ఈ డిజిటల్ హక్కుల ద్వారానే మేకర్స్ మంచి మొత్తాన్ని సొంతం చేసుకు...