భారతదేశం, అక్టోబర్ 2 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. మానవుల కర్మలకు తగిన ప్రతిఫలాన్ని ప్రదానం చేసే న్యాయాధిపతిగా, క్రమశిక్షణ మరియు బాధ్యతలకు సంకేతంగా శని గ్రహాన్ని పరిగణిస్తారు. నవగ్రహాలలో కెల్లా అత్యంత నెమ్మదిగా కదిలే శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి దాదాపు రెండేళ్లన్నర సమయం తీసుకుంటాడు. అందుకే శని సంచారం లేదా గోచార ప్రభావం వ్యక్తిగత జీవితాలపైనా, సమాజంపైనా చాలా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది.

గ్రహాల గణన ప్రకారం 2027 సంవత్సరం శని సంచారంలో అత్యంత కీలకమైన మలుపు కానుంది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శనిదేవుడు.. 2027 జూన్ 3న మీనాన్ని వీడి మేషరాశిలోకి ప్రవేశించనున్నారు. ప్రవేశ సమయంలో ఆయన అశ్విని నక్షత్రంలోకి అడుగుపెడతారు. అయితే మేషంలో శని ప్రవేశం శాశ్వతం కాదు. మేషరాశిలో సంచరించిన అనంతరం, వక్రగతి (తిరోగమనం) ...