భారతదేశం, ఆగస్టు 2 -- హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో పవిత్ర స్థానం ఉంది. ఈ మాసంలో పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సరిగ్గా ఇదే సమయంలో న్యాయదేవుడైన శనిదేవుడు తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆగస్టు 20, 2026 న శని భగవానుడు రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించనున్నారు.

గ్రహాలన్నింటిలోకి అత్యంత మందగమనంతో సంచరించే శని దేవుడి ఈ నక్షత్ర మార్పు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో ఇది పెను మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఈ కాలం స్వర్ణయుగంగా మారనుందని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పంచాంగ గణన ప్రకారం, ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న శనిదేవుడు.. ఆగస్టు 20, 2026 న రేవతి నక్షత్రం రెండో పాదం నుంచి మొదటి పాదంలోకి అడుగుపెట్టనున్నారు. శన...