భారతదేశం, జూలై 23 -- వేద జ్యోతిష్య శాస్త్రంలో శని భగవానుడిని కర్మఫల ప్రదాతగా, సాక్షాత్తు న్యాయదేవతగా భావిస్తారు. మనిషి చేసిన కర్మలకు తగిన ఫలితాలను ఇచ్చే శనిదేవుడు తన గమనాన్ని మార్చుకున్న ప్రతిసారీ, దాని ప్రభావం సమస్త ద్వాదశ రాశుల మీద తీవ్రంగా పడుతుంది. రాబోయే జూలై 27, 2026న శని తిరోగమనం చేయబోతున్నారు.

ఇది అనేక నెలల పాటు ప్రభావం చూపనుంది. ఈ ప్రత్యేక కాలంలో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సువర్ణావకాశాలు లభిస్తే, మరికొన్ని రాశుల వారు మాత్రం ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఉంది.

ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం భూమి నుంచి చూస్తున్నప్పుడు వ్యతిరేక దిశలో కదులుతున్నట్లు కనిపిస్తే దాన్నేతిరోగమనం (Retrograde) అంటారు. జ్యోతిష్య కోణంలో శని వక్రీకరించడం అంటే మానవుల కర్మల సమీక్ష, గతంలో నిలిచిపోయిన పన...