భారతదేశం, ఏప్రిల్ 29 -- శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది శనిజయంతి మే 16న వచ్చింది. ఆ రోజు కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. శని జయంతి వేళ ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది, ఏ రాశుల వారు ఏ విధమైన లాభాలను పొందుతారు, శని అనుగ్రహంతో సంతోషంగా ఎవరు ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

మకర రాశికి అధిపతి శని దేవుడు. ఈ శని జయంతి వేళ ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.

కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికపరంగా మెరుగు...