భారతదేశం, జూలై 21 -- హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే కృష్ణ, శుక్ల పక్షాల్లో ఏకాదశి వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర తిథి పూర్తిగా జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది.

ఏకాదశి రోజున శ్రీహారితో పాటు మహాలక్ష్మి దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అశాంతి తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జీవితాంతం సకల సౌభాగ్యాలను అనుభవించి, అంతిమంగా విష్ణు లోకాన్ని చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తున్న తరుణంలో, ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశిని 'దేవశయని ఏకాదశి' లేదా 'తొలి ఏకాదశి'గా జరుపుకుంటారు. ఈ శుభదినాన శ్రీమహావిష్ణువు రాబోయే నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని చెబుతారు. ఈ నాలుగు నెలల పాటు సృష్టి నిర్వహణ బాధ్యతలను ...