Hyderabad, జూన్ 23 -- గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని శుభ యోగాలు, కొన్ని అశుభ యోగాలు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు కుజుడు, కేతువు ప్రమాదకరమైన యోగాన్ని సృష్టిస్తున్నారు. సింహ రాశిలో కుజుడు-కేతువు కారణంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే శని-కుజుడు కూడా అశుభ యోగాలను ఏర్పరుస్తున్నారు.

కుజుడు, శని, కేతువుల సంయోగం, షడష్టక యోగం, కుజ-కేతు యోగంను సృష్టిస్తోంది. ఈ యోగం జూన్ 30 నుంచి ప్రభావవంతమవుతుంది. జూలై 28 వరకు ఇది కొనసాగుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు.

మేష రాశి వారికి కుజుడు-కేతువు-శని సంయోగం కాస్త సమస్యలను తీసుకొస్తుంది. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లావాదేవీలు జరిపేటప్పుడు జ...