భారతదేశం, జూన్ 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జూలై 22న సూర్య-చంద్రుల వైధృతి యోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనోకారకుడు. ఈ రెండు గ్రహాలు కలిసి వైధృతి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. అయితే కొన్ని గ్రహస్థితుల్లో ఇదే యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది.

వైధృతి యోగం జూలై 22, బుధవారం సాయంత్రం 4:06 నుంచి రాత్రి 9:51 వరకు ఉంటుంది. ఈ యోగం నాలుగు రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది...