Hyderabad, ఆగస్టు 25 -- పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో కెమెరామెన్‌గా కుశేందర్ రమేష్ రెడ్డికి గుర్తింపు వచ్చింది. ఆయన సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన లేటెస్ట్ మూవీ 'త్రిబాణధారి బార్బరిక్' ఆగస్ట్ 29న రాబోతోంది.

ఈ నేపథ్యంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన త్రిబాణధారి బార్బరిక్ గురించి, మరీ ముఖ్యంగా విజువల్స్ గురించి, సినిమాకు పడిన కష్టంతోపాటు మూవీకి సంబంధించిన విశేషాలను సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి పంచుకున్నారు.

-'రజాకార్' చివరి షెడ్యూల్‌లో ఉన్నప్పుడు దర్శకుడు మోహన్ ఈ కథ గురించి చెప్పారు. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. కథ విన్న తరువాత నా సలహాలు, సూచనలు చెప్పాను.

-ఎలాంటి కలర్ గ్రేడింగ్, ప్యాట్రన్ వాడితే బాగుంటుందనే రిఫరెన్సులు కూడా ఇచ్చాను. అవన్నీ కూడా మారుతి గారికి చాలా నచ్చాయి. దీంతో దర్శకుడు మోహన్, నిర్మాత విజ...